RRB Section Controller Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కొత్త జాబ్ నొటిఫికేషన్ వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇది ఇక గొప్ప అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి..

RRB Section Controller Notification 2025 Overview
| వివరాలు | సమాచారం |
| సంస్థ | రైల్వే రీజినల్ రిక్రూట్మెంట్ బోర్డు (RRRB) |
| నోటిఫికేషన్ నంబర్ | CEN 04/2025 |
| పోస్టు పేరు | Section Controller |
| ఉద్యోగ రకం | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| అధికారిక వెబ్‌సైట్ | rrb.gov.in |
ఖాళీల వివరాలు(Vacancy Details) :
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెక్షన్ కంట్రోల్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 368 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : సెక్షన్ కంట్రోలర్
- పోస్టుల సంఖ్య : 368
అర్హతలు(Eligibility) :
RRB Section Controller Notification 2025 పోస్టులకు దరఖస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి(Age Limit) :
RRB Section Controller Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
RRB Section Controller Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ మోడ్ లో దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / దివ్యాగులు / మహిళలు : రూ.250/-
ఎంపిక ప్రక్రియ(Selection Process) :
RRB Section Controller Notification 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం వివరాలు(Salary) :
RRB Section Controller Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం చెల్లించడం జరుగుతుంది.. అభ్యర్థులకు రూ.35,000 – రూ.1,12,000/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం(How to Apply) :
RRB Section Controller Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు సంబంధిత RRB అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
- CEN 04/2025 Section Controller లింక్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలతో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించాలి.
- ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫైనల్ సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ కాపీని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14.10.2025
| Notification | Click here |
| Apply Online | Click here |









