ECIL Technical Officer Recruitment 2025: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు మొదట 9 నెలల కాంట్రాక్ట్‌కి ఉంటాయి. అవసరాన్ని బట్టి గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదులో పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి ఇండియా అంతటా కూడా పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది.
Vacancy Details :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 160
Educational Qualification :
ECIL Technical Officer Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు BE/B.Tech లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. అర్హత కలిగిన బ్రాంచులు ECE, ETC, E&I, Electronics, EEE, Electrical, CSE, IT మరియు Mechanical. అయితే SC మరియు ST అభ్యర్థులకు కనీస అర్హత 50% మార్కులు మాత్రమే కావాలి. ఈ ఉద్యోగాలకు ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి. Apprenticeship కూడా ఇందులో లెక్కలోకి తీసుకుంటారు.అదనంగా అభ్యర్థులు MS Office లో బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
Age Limit :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులకు 31.08.2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Application Fees :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులను మొదట ఇంజనీరింగ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ప్రతి నాలుగు ఖాళీలకు ఒక అభ్యర్థిని పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హైదరాబాదులో పిలుస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికలో 20% మార్కులు అర్హతలకు, గరిష్టంగా 30 మార్కులు అనుభవానికి మరియు 50 మార్కులు ఇంటర్వ్యూకి కేటాయించబడతాయి.
Salary Details :
ECIL Technical Officer Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు ₹25,000, రెండవ సంవత్సరం ₹28,000, మూడవ మరియు నాలుగవ సంవత్సరాల్లో ₹31,000 చెల్లించబడుతుంది. అదనంగా మెడికల్ ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్, PF కాంట్రిబ్యూషన్, TA/DA మరియు పేడ్ లీవ్స్ వంటి లాభాలు కూడా ఉంటాయి.
How To Apply :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ని సందర్శించాలి.
- Careers → Current Job Openings లోకి వెళ్లి Online Application Form ఫిల్ చేయండి
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22.09.2025
| Notification | Click here |
| Apply Online | Click here |









