CSL Executive Trainee Recruitment 2025: మంచి జీతాలు, స్థిరమైన కెరీర్ కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. భారత ప్రభుత్వ మినీ రత్న సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL) నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. కంపెనీ సెక్రటరీ, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 15, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. తక్కువ పోస్టులు ఉన్నా, ఎంపికైన వారికి పెద్ద జీత ప్యాకేజీతో పాటు గొప్ప కెరీర్ అవకాశాలు ఉంటాయి.
CSL Executive Trainee Recruitment 2025 Overview
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL) ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నియామకాలు పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే జరుగుతాయి. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15, 2025 వరకు కొనసాగుతుంది.
Vacancy Details
ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. వాటిలో కంపెనీ సెక్రటరీ విభాగంలో 3 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 1 పోస్టు, నావల్ ఆర్కిటెక్చర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Eligibility Criteria
ప్రతి పోస్టుకు అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. కంపెనీ సెక్రటరీ పోస్టుకు ICSI లో అసోసియేట్ సభ్యత్వం లేదా 10 నెలల ప్రాక్టికల్ శిక్షణతో CS ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లో ఉత్తీర్ణత ఉండాలి. ఎంపికైన తర్వాత 15 నెలల్లోపు అసోసియేట్ మెంబర్ కావాలి. ఎలక్ట్రానిక్స్ విభాగానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65% మార్కులతో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. నావల్ ఆర్కిటెక్చర్ విభాగానికి కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.
Age Limit
అభ్యర్థుల గరిష్ట వయస్సు అక్టోబర్ 15, 2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Application Fee
CSL Executive Trainee Recruitment 2025 కు అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.750/- ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫీజు లేదు.
Selection Process
ఎంపిక ప్రక్రియ పలు దశలలో జరుగుతుంది. మొదటగా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ (60 మార్కులు) ఉంటుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ (10 మార్కులు), రైటింగ్ స్కిల్స్ టెస్ట్ (10 మార్కులు), చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ (20 మార్కులు) నిర్వహిస్తారు. మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
Salary Details
ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు రూ.50,000/- స్టైఫండ్ లభిస్తుంది. అనంతరం అసిస్టెంట్ మేనేజర్ గా నియామకం పొందితే రూ.40,000 – రూ.1,40,000/- వరకు జీతం ఉంటుంది. కొచ్చిలో వార్షిక ప్యాకేజీ సుమారు రూ.14 లక్షలు వరకు ఉంటుంది.
How to Apply
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cochinshipyard.in/ లోకి వెళ్లాలి. అక్కడ కెరీర్ సెక్షన్ లో CSL Executive Trainee Recruitment 2025 లింక్ పై క్లిక్ చేసి SAP ఆన్ లైన్ పోర్టల్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అప్లికేషన్ ఫారం నింపి, అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి, ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయాలి.
Important Dates
దరఖాస్తు ప్రారంభ తేదీ 24 సెప్టెంబర్ 2025 కాగా, చివరి తేదీ 15 అక్టోబర్ 2025 గా నిర్ణయించారు.
Notification : Click here
Apply Online : Click here








