ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఆధ్వర్యంలో IBPS RRB Notification 2025 విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో Officers (Scale 1, 2, 3) మరియు Office Assistants (Multipurpose) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 12,718 ఖాళీలు ఉన్నట్లు IBPS ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Vacancies Details
ఈ నోటిఫికేషన్లో మొత్తం 12,718 పోస్టులు ఉన్నాయి. అందులో Office Assistants (Multipurpose) కోసం 7,472 పోస్టులు, Officer Scale-1 (Assistant Manager) కోసం 3,907 పోస్టులు, అలాగే Officer Scale-2 మరియు 3 కలిపి 1,339 పోస్టులు ఉన్నాయి.
Eligibility
ఈ ఖాళీలకు సంబంధించిన అర్హతలు పోస్టు వారీగా వేర్వేరుగా ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్లు మరియు ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. Officer Scale-2, 3 పోస్టులకు అయితే బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో అనుభవం కూడా ఉండాలి.
Age Limit
వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది.
- ఆఫీస్ అసిస్టెంట్: 18 నుండి 28 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్-1: 18 నుండి 30 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్-2: 21 నుండి 32 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్-3: 21 నుండి 40 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Application Fee
దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. General, OBC మరియు EWS వర్గాలకు ₹850, SC, ST మరియు PwBD వర్గాలకు ₹175 ఫీజు నిర్ణయించారు.
Selection Process
ఎంపిక విధానం పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటుంది.
- ఆఫీస్ అసిస్టెంట్స్ మరియు ఆఫీసర్ స్కేల్-1: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, అలాగే Officer Scale-1 కి ఇంటర్వ్యూ ఉంటుంది.
- Officer Scale-2 మరియు 3: సింగిల్ లెవల్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
Salary Details
ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం ఇవ్వబడుతుంది. ఆఫీస్ అసిస్టెంట్స్‌కు నెలకు ₹35,000 నుండి ₹40,000 వరకు, Officer Scale-1 పోస్టులకు ₹50,000 నుండి ₹55,000 వరకు జీతం ఉంటుంది. మిగతా పోస్టులకు నిబంధనల ప్రకారం జీతం నిర్ణయిస్తారు.
How to Apply
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరగాలి. అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ www.ibps.in సందర్శించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలు నింపి, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.
Important Dates
- దరఖాస్తు ప్రారంభం: 01 సెప్టెంబర్ 2025
- చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2025 (పొడిగించబడింది)
| Notification | Click here |
| Apply Online | Click here |
| Official Website | Click here |








