ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టులకు డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పరీక్షలో చాలా మంది బాగా ప్రిపేర్ అయినప్పటికీ ఉద్యోగాలు రాలేదు. అలాంటి అభ్యర్థులకు ఇప్పుడు గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) కింద ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 7,267 ఖాళీలు భర్తీ చేయబడనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
EMRS Teaching & Non Teaching Recruitment 2025 Overview
ఈ నియామక ప్రక్రియను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిర్వహిస్తోంది. మొత్తం 7,267 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) 2025 ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం అంతటా ఉన్న EMRS స్కూల్స్‌లో నియమించబడతారు.
Vacancy Details
ఈ రిక్రూట్‌మెంట్ లో ప్రధానంగా టీచింగ్ మరియు హాస్టల్ వార్డెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7,267 ఖాళీలు ఉన్నాయి. ఇందులో TGT (మెయిన్ సబ్జెక్ట్స్) 3,311 పోస్టులు, TGT (థర్డ్ లాంగ్వేజ్) 652 పోస్టులు, ఇతర TGTలు 1,697 పోస్టులు, హాస్టల్ వార్డెన్ (పురుషులు) 335 పోస్టులు, హాస్టల్ వార్డెన్ (మహిళలు) 334 పోస్టులు ఉన్నాయి.
Education Qualification
TGT పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు B.Ed, CTET అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ వంటి మెయిన్ సబ్జెక్ట్‌లలో B.Ed లేదా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. థర్డ్ లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు సంబంధిత భాషలో గ్రాడ్యుయేషన్ + B.Ed + CTET ఉండాలి. TGT మ్యూజిక్ పోస్టులకు మ్యూజిక్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్ పోస్టులకు ఫైన్ ఆర్ట్స్ లేదా క్రాఫ్ట్స్ లో డిగ్రీ లేదా ఫైన్ ఆర్ట్స్ లో B.Ed అర్హత అవసరం. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Age Limit
EMRS Teaching & Non Teaching Recruitment 2025 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
Application Fees
దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు TGT పోస్టులకు రూ.1,500, హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు ఫీజు మినహాయింపు ఉంది.
Selection Process
అభ్యర్థుల ఎంపిక EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) 2025 ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష OMR ఆధారిత ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
Exam Pattern
TGT పోస్టులకు 150 మార్కుల పరీక్ష ఉంటుంది. ఇందులో 120 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు, 30 మార్కులు భాషా సామర్థ్యానికి కేటాయిస్తారు. ప్రశ్నలు జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ICT నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూట్, డొమైన్ నాలెడ్జ్ మరియు లాంగ్వేజ్ సామర్థ్యంపై ఆధారంగా ఉంటాయి. పరీక్షకు 180 నిమిషాల సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్క్ ఉంటుంది.
హాస్టల్ వార్డెన్ పోస్టులకు 120 మార్కుల పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ICT నాలెడ్జ్, POCSO మరియు ఇతర చైల్డ్ సేఫ్టీ చట్టాలపై నాలెడ్జ్, భాషా సామర్థ్యంపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు, నెగటివ్ మార్కింగ్ 0.25 వర్తిస్తుంది.
Salary Details
ఈ పోస్టులకు 7వ వేతన సంఘం ప్రకారం ఆకర్షణీయమైన జీతం అందుతుంది. TGT మెయిన్ సబ్జెక్ట్ టీచర్లకు రూ.44,900 – రూ.1,42,400, ఇతర TGT పోస్టులకు రూ.35,400 – రూ.1,12,400, హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.29,200 – రూ.92,300 జీతం ఉంటుంది.
How to apply
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ఫారమ్‌లో వివరాలు నింపి, అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన తరువాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Important Dates
EMRS Teaching & Non Teaching Recruitment 2025 కోసం దరఖాస్తులు 2025 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు స్వీకరించబడతాయి. అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేయడం మంచిది.
| Notification | Click here |
| Apply Online | Click here |








