AP Prisons Department Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా జైళ్ల శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మన్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోపు పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా అప్లికేషన్లు సమర్పించాలి.

Vacancy Details :
మొత్తం పోస్టుల సంఖ్య : 04
- ఫార్మసిస్ట్ (గ్రేడ్-2) : 01
- ఆఫీస్ సబార్డినేట్ : 01
- వాచ్ మన్ : 01
- డ్రైవర్(LMV) : 01
Eligibility :
- ఫార్మసిస్ట్ : B.Pharma / M.Pharma / D.Pharma ఉత్తీర్ణులై ఉండాలి.
- ఆఫీస్ సబార్డినేట్ : 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- వాచ్ మన్ : 5వ లేదా 7వ తరగతి చదివి ఉండాలి.
- డ్రైవర్ : 10వ తరగతి ఉత్తీర్ణత + లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
Age Limit :
- 18 నుంచి 42 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
Application Fees :
AP Prisons Department Notification 2025 అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Selection Process:
- అభ్యర్థుల విద్యార్హతల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా
- ఫార్మసిస్ట్ పోస్టుకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.
Salary Details :
- ఫార్మసిస్ట్ గ్రేడ్-2 : రూ.17,500/-
- ఆఫీస్ సబార్డినేట్ : రూ.15,000/-
- వాచ్ మన్ : రూ.15,000/-
- డ్రైవర్ : రూ.18,500/-
How to Apply :
AP Prisons Department Notification 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి.
- అభ్యర్థులు ముందుగా https://guntur.ap.gov.in వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో ఉన్న అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోండి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి.
- అడ్రస్ : The Superintendent, District Jail, Taluka compound, Brodipet, Guntur 522002, Guntur District.
Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29.09.2025
| Notification | Click here |
| Application | Click here |
| Official website | Click here |









