BRBNMPL Notification 2025 Out | 88 Vacancies for Engineers & Diploma Holders – Apply Online!

Published On: September 15, 2025
Follow Us
BRBNMPL Notification 2025

BRBNMPL Notification 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మైసూరు (కర్ణాటక), సాల్బోని (పశ్చిమ బెంగాల్) ప్రెస్‌లలో ఖాళీలను భర్తీ చేయడానికి Deputy Manager మరియు Process Assistant Grade-I (Trainee) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 88 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ వరకు(పొడిగించబడింది) ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

BRBNMPL Recruitment 2025 Overview

వివరాలుసమాచారం
సంస్థBharatiya Reserve Bank Note Mudran Pvt. Ltd (BRBNMPL)
ప్రకటన నం.02/2025
పోస్టులుDeputy Manager, Process Assistant Grade-I (Trainee)
ఖాళీలుమొత్తం 88
దరఖాస్తు విధానంOnline
దరఖాస్తు తేదీలు10.08.2025 – 29.09.2025(పొడిగించబడింది)
పరీక్ష అక్టోబర్ 2025 (Online)
వెబ్‌సైట్www.brbnmpl.co.in

Vacancy Details : 

Bharatiya Reserve Bank Note Mudran Pvt. Ltd. (BRBNMPL) అనేది RBI యొక్క అనుబంధ సంస్థ. ఇది మైసూరు మరియు సాల్బోనిలోని ప్రెస్‌ల ద్వారా భారతదేశానికి కావలసిన కరెన్సీ నోట్లు ముద్రిస్తుంది. నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలతో దేశానికి సురక్షిత కరెన్సీని అందించడం దీని ప్రధాన బాధ్యత. ఈ సంస్థ నుంచి  డిప్యూటీ మేనేజర్ మరియు ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 88 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
డిప్యూటీ మేనేజర్ – ప్రింటింగ్ ఇంజనీరింగ్10
డిప్యూటీ మేనేజర్ – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్03
డిప్యూటీ మేనేజర్్ – కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్02
డిప్యూటీ మేనేజర్ – జనరల్ అడ్మినిస్ట్రేషన్09
ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్-1(ట్రైనీ)64
మొత్తం88

Eligibility Details : 

BRBNMPL Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి. 

  • డిప్యూటీ మేనేజర్ – ప్రింటింగ్ : ప్రింటింగ్ టెక్ లో BE / B.Tech + ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలో 2 సంవత్సరాల అనుభవం
  • డిప్యూటీ మేనేజర్ – ఎలక్ట్రికల్ :  BE / B.Tech / AMIE + 2 సంవత్సరాల అనుభవం
  • డిప్యూటీ మేనేజర్ – ఐటీ : BE / B.Tech / AMIE + 2 సంవత్సరాల అనుభవం
  • డిప్యూటీ మేనేజర్ – అడ్మిన్ : గ్రాడ్యుయేట్ + మేనేజ్మెంట్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / పర్సనల్ మేనేజ్మెంట్ / మేటీరియల్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా + ప్రొడక్షన్ / మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 2 సంవత్సరాల అనుభవం
  • ప్రాసెస్ అసిస్టెంట్ (డిప్లొమా) : సంబంధిత ట్రేడ్ లో డిప్లొమా + 1 సంవత్సరం అనుభవం
  • ప్రాసెస్ అసిస్టెంట్ (ఐటీఐ) : ITI / NTC / NAC + 2 సంవత్సరాల అనుభవం (NAC ఉన్న వారికి 1 సంవత్సరం అనుభవం)

Age Limit : 

  • డిప్యూటీ మేనేజర్ : 18 నుంచి 31 సంవత్సరాలు
  • ప్రాసెస్ అసిస్టెంట్ : 18 నుంచి 28 సంవత్సరాలు
  • ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు

Application Fees : 

BRBNMPL Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిడిప్యూటీ మేనేజర్(ఫీజు)ప్రాసెస్ అసిస్టెంట్(ఫీజు)
జనరల్రూ.600/-రూ.400/-
SC/ST/PwBD/Women/Ex-servicemen/ Internal (BRBNMPL)ఫీజు లేదుఫీజు లేదు

Selection Process: 

BRBNMPL Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

డిప్యూటీ మేనేజర్

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ప్రాసెస్ అసిస్టెంట్

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Salary Details : 

BRBNMPL Notification 2025 పోస్టులను బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • డిప్యూటీ మేనేజర్ : అభ్యర్థులకు నెలకు రూ.88,638/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 
  • ప్రాసెస్ అసిస్టెంట్ : ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.24,000/- ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెవల్-2 ప్రకారం నెలకు సుమారు రూ.1,00,000/- వరకు జీతం ఉంటుంది.  

How to Apply: 

BRBNMPL Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 29 సెప్టెబర్, 2025 (పొడిగించబడింది)
NotificationClick here
Apply OnlineClick here

Rajak

Myself Rajak i am a professional writer having 7 years experience in blogging

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment