DRDO ITR Apprentice Jobs 2025 : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన Integrated Test Range (ITR), Chandipur లో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇవ్వబడుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, లైబ్రరీ సైన్స్, BBA, B.Com వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

DRDO ITR Apprentice Jobs 2025 Overview
| వివరాలు | సమాచారం |
| సంస్థ | Integrated Test Range (ITR), DRDO |
| ప్రకటన నంబర్ | ITR/HRD/AT/10/2025 |
| పోస్టు పేరు | Graduate & Technician (Diploma) Apprentice |
| మొత్తం ఖాళీలు | 54 |
| శిక్షణ కాలం | 1 సంవత్సరం |
| దరఖాస్తు విధానం | ఆఫ్లైన్ (Speed Post/Registered Post) |
| చివరి తేదీ | 20 అక్టోబర్ 2025 |
| వెబ్సైట్ | drdo.gov.in |
Vacancy Details :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు:
- Computer Science/IT/ICT సంబంధిత విభాగాలు – 08
- Electronics & Communication/Electrical/E&I – 08
- Electrical Engineering – 02
- Mechanical Engineering – 01
- Aerospace Engineering – 01
- Library Science – 02
- Safety Engineering – 02
- BBA (Administration/HR) – 04
- B.Com (Accounts/Costing) – 04
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ :
- Computer Science/IT/ICT సంబంధిత విభాగాలు – 08
- Electronics & Communication/Electrical/E&I – 08
- Electrical Engineering – 02
- Cinematography – 02
- Medical Lab Technology – 02
Eligibility Details :
DRDO ITR Apprentice Jobs 2025 గ్రాడ్యుయేట్ మరియు అప్రెంటిస్ పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి..
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : గర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE / B.Tech / B.Lib.Sc / BBA / B.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ ని 2021, 2022, 2023, 2024, 2025 సంవత్సాలు చేసి ఉండాలి.
- టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ : గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- Post Graduate అర్హత కలిగినవారు అనర్హులు.
- అభ్యర్థులు తప్పనిసరిగా NATS Portal (www.nats.education.gov.in) లో రిజిస్టర్ అయి ఉండాలి
Age Limit :
DRDO ITR Apprentice Jobs 2025 నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా వయోపరిమితి గురించి పస్తావన లేదు. అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం వయోపరిమితి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EWS అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది.
Application Fees:
DRDO ITR Apprentice Jobs 2025 అభ్యర్థులji ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Selection Process:
DRDO ITR Apprentice Jobs 2025 అభ్యర్థులను రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష / ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
- Shortlisted అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందుతుంది.
Salary Details :
DRDO ITR Apprentice Jobs 2025 ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో ఆకర్షణీయమైన స్టైఫండ్ లభిస్తుంది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.9,000/-
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ : రూ.8,000/-
How to Apply:
DRDO ITR Apprentice Jobs 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ లు సమర్పించాలి.
- అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- ఇటీవల పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ :
- The Director, Integrated Test Range (ITR), Chandipur, Balasore, Odisha – 756025
- కవర్ పై ‘Application for Apprenticeship Training:Category – Graduate / Technician Apprentice & Subject/Discipline-…’ అని రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ : 08 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 అక్టోబర్, 2025
| Notification & Application | Click here |
| Official Website | Click here |









